ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

తిర్యాణి: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్‌లు, పెన్నులు, వాటర్‌ బాటిళ్లు అందించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోనే జీవితంలో ముందుకెళ్లవచ్చన్నారు. ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికావొద్దన్నారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement