కాగజ్‌నగర్‌టౌన్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో 2కే రన్‌ను వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనితతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు ఈ రన్ కొనసాగింది. చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజ లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని తెలిపారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవ న విధానాన్ని పెంపొందించడం, పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా మార్చడమే 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, కావేటి విజయ్ కుమార్, వసీమున్సీస, పెందోర్ మాణిక్యారావు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.


