కెరమెరి: ఆరోగ్యకరమైన జీవనం గడుపుదామని మహిళా అభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజె క్టు మేనేజర్ బ్రహ్మచారి, ప్రాజెక్టు అధికారి ప్రవీణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ని మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం వీవోఏలకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ప్రాముఖ్యత గురించి వివరించారు. తాగునీటి మూలాల వినియోగం, హ్యాండ్ వాష్, క్షేత్రస్థాయిలోని లోపాలను అధిగమించడంపై సూచనలు చేశారు. ప్రజ లకు వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్య త వీవోఏలపై ఉందన్నారు. ప్రతీ కుటుంబం మరుగుదొడ్లు వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీలు జీవన్, ధన్‌రాజ్, దస్తగిరి, సుబ్బారావు, కవిత, సుజాత, సత్తయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


