రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో మూతపడిన డోర్లి– 2 ఓసీపీని మంగళవారం నాగ్‌పూర్ కోల్ కంట్రోల్ ఆఫీస్ ఓఎస్‌డీ రాజేంద్ర చోలే, కొత్తగూడెం కోల్ కంట్రోల్ ఆఫీస్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రావు సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ ప నులను పరిశీలించారు. ఓసీపీ వద్ద నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో యాజమాన్యం చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి నిర్వహణ, మృతిక సంరక్షణ వివరాలను తెలుసుకున్నారు. అంతకు ముందు జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి కోల్ కంట్రోల్ అధికారులకు ఏరియా వివరాలను వెల్ల డించారు. కార్యక్రమాల్లో గోలేటి ఓసీపీ ప్రాజెక్టు అ ధికారి నాయిని ఉమాకాంత్, ఏరియా సర్వే అధికా రి అఫ్సర్ పాషా, కార్పొరేట్ అదనపు మేనేజర్ తిరుపతి, డోర్లి ఓసీపీ– 2 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్‌మెంట్ అధికారి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


