జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు భార్యను వదిలి విదేశాలకు వెళ్లాడు. నాలుగేళ్లుగా పట్టించుకోకపోవడంతో బాధితురాలు అత్తింటి ఎదుట కొద్ది రోజులుగా ఆందోళనకు దిగింది. బాధితురాల కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన సొంటి కళావతి, మధుసూదన్‌రెడ్డి దంపతుల కూతురు తనుశ్రీని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లికి చెందిన చాడ శోభ, రాఘవేందర్‌రెడ్డి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి 2015 ఫిబ్రవరి 11న వివాహం చేశారు. తనుశ్రీ తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో తల్లే అన్నీ తానై కూతురు వివాహం చేసింది.