వ్యవసాయ, రిటైల్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్yీ ఐ)ను అనుమతించొద్దని స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ గురిజాల రవీందర్ కోరారు.
వ్యవసాయ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించొద్దు
Aug 26 2016 12:25 AM | Updated on Jun 4 2019 5:04 PM
హన్మకొండ : వ్యవసాయ, రిటైల్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్yీ ఐ)ను అనుమతించొద్దని స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ గురిజాల రవీందర్ కోరారు. ఈ మేరకు గురువారం హన్మకొండలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. తమ విజ్ఞాపన పత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పం పించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, రిటైల్ రంగాల్లోకి ఎఫ్‌డీఐలు ప్రవేశపెడితే కోట్లాది కుటుంబాలు ఉపాధిని కోల్పోతాయన్నారు. ఫార్మసీ రంగంలో 5 సంవత్సరాల పేటెంట్ 20 సంవత్సరాలకు పెంచడం ద్వారా సగటు రోగికి మందులు ఆందుబాటులో ఉండే పరిస్థితి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి, రాంచందర్‌రావు, సౌమిత్రి లక్ష్మణాచార్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement