ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ ఎప్పటిలానే వాగ్వాదాలు, తోపులాటలతో వారుుదాపడింది.
తీరుమారని విద్యాశాఖ
Sep 11 2013 3:09 AM | Updated on Sep 1 2017 10:36 PM
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ ఎప్పటిలానే వాగ్వాదాలు, తోపులాటలతో వారుుదాపడింది. సీనియారిటీ జాబితాను రూపొందించడంలో విద్యాశాఖ తీరు మారులేదు. సర్వీస్ నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా రూపకల్పన ప్రక్రియ షరామామూలుగా జాప్యం జరిగింది. హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల యాజమాన్య పరిధిలోని పాఠశాలల ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిం చారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకే అర్హులైన ఎస్జీటీ అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు.
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీల్లో బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, పీడీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంలు అన్ని కలిపి 84 వరకు వేకెన్సీల్లో పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అయితే సబ్జెక్టుల వారీ గా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపొందించడంలో జాప్యం జరగగా... సాయంత్రం 6 గంటల వరకు పలు అభ్యం తరాలు వస్తూనే ఉన్నాయి. తమ పేర్లను సీనియారిటీ జాబితా లో చేర్చాలని కొందరు... 610 జీఓ ప్రకారం పదోన్నతులు కల్పించాలని మరికొందరు... ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్ల ప్రకారం పదోన్నతులు చేపట్టాలని ఆ సంఘాల ఉపాధ్యాయు లు విజ్ఞప్తులు కోకొల్లలుగా రావడంతో జాబితా రూపొందించడంలో జాప్యం చోటుచేసుకుంది. వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని... వాటిని సరిచూడకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం కుదరదని డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ చెప్పడంతో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. నిర్వహించాల్సిందేనని డీఈఓను పట్టుబట్టగా... సాయంత్రం 6.15గంటల వరకు నిర్వహిస్తామని విజయ్‌కుమార్ చెప్పారు.
ఆ సమయం కూడా దాటిపోవడంతో మళ్లీ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మరి కొందరు ఉపాధ్యాయులు అక్కడికి వచ్చి... అన్ని పరిశీలించాకే పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని, లేకుంటే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం,. తోపులాట చోటుచేసుకుంది. దీంతో చాంబర్ నుంచి డీఈఓ బయటికి వెళుతుండగా... ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులు పలువురు కారుకు అడ్డంగా పడుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పదోన్నతులు నిర్వహిస్తామని డీఈఓ ప్రకటించారు. దీంతోపాటు ఉపాధ్యాయుల ఆందోళన విషయూన్ని అదనపు జేసీ సంజీవయ్యకు డీఈఓ ఫోన్‌లో చెప్పారు. ఇంతలో సుబేదారి పోలీసులు డీఈఓ కార్యాలయూనికి వచ్చి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు
ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల సంఘాల జేఏసీ నాయకులు దామెర ఉపేందర్, కొమ్ముల బాబు, యు.బిక్షపతి, నరేంద ర్‌నాయక్, ప్రవీణ్‌కుమార్,హాల్యానాయక్ రాత్రి 8.30 గంటల తర్వాత కలెక్టర్ కిషన్‌ను కలిశారు. ఎస్సీ,ఎస్టీ రోస్టర్ ప్రకారం పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించేలా చూడాలని కోరారు. తాను డీఈఓతోమాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కాగా, ఇద్దరు ఉపాధ్యాయులు కులం పేరుతో దూషించారని, కొట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘం నేతలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారిపై పోలీసులు కేసు నమోద ుచేసినట్లు సమాచారం
నేడు కౌన్సెలింగ్ లేనట్లే..
ఇదిలా ఉండగా... అభ్యంతరాలు, విజ్ఞప్తులు పరిశీలించాకే సీనియారిటీ జాబితా రూపొందిస్తామని డీఈఓ విజయకుమార్ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో సమవేశం నిర్వహించిన తర్వాతే ఒక తేదీని నిర్ణయించి పదోన్నతులు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.హైదరాబాద్‌లో కోర్టు కేసుకు హాజరుకావాల్సిన్నందున బుధవారం పదోన్నతుల కౌన్సెలింగ్‌ను నిర్వహించలేమన్నారు, కాగా, ప్రభుత్వ యాజమన్యాలపరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు మంగళవారం మ్యాథ్స్, బయోలజికల్ సైన్స్, పీడీ, హిందీ స్కూల్‌అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఇంగ్లిష్ ,ఫిజికల్‌సైన్స్,ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంల పదోన్నతులు వాయిదా పడ్డాయని వెల్లడించారు.
Advertisement
Advertisement