రోడ్డెక్కిన హాస్టల్‌ విద్యార్థులు | Girls Hostel Students Protest On Rice Illegal Transport At Hanamkonda | Sakshi
Sakshi News home page

మాయమవుతున్న బియ్యంపై విద్యార్థుల కన్నెర్ర

Aug 23 2019 2:37 PM | Updated on Sep 22 2019 1:51 PM

Girls Hostel Students Protest On Rice Illegal Transport At Hanamkonda - Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: బాలికల వసతి గృహంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం హన్మకొండలోని జూలైవాడ గిరిజన బాలికల హాస్టల్‌ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు. వసతి గృహంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందులో వార్డెన్‌ ప్రమేయం ఉందని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్‌ వార్డెన్‌ను తొలగించాలని, అదే విధంగా అక్రమ బియ్యం రవాణాపై విచారణ జరిపి దోషులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన భోజనాన్ని సమయానికి అందించాలని, హాస్టల్‌ విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement