అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తాం: ఈటల | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తాం: ఈటల

Published Sat, Apr 15 2023 6:36 PM

Etela Rajender Slams KCR Sarkar - Sakshi

సాక్షి, హన్మకొండ: ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నా ఈటల. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామని ఈటల అన్నారు. హన్మకొండలో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ చేపట్టింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీజేపీ నాయకులు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు నిరుద్యోగ యువత ఈ మార్చ్‌లో  పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాలయాపన వద్దు.. కొలువులు ముద్దు అంటూ నిరుద్యోగ యువత మార్చ్‌లో పాల్గొంది. కేయూ క్రాస్‌ నుండి బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ ప్రారంభమయ్యే బీజేపీ నిరుద్యోగ మార్చ్‌. నయీమ్‌ నగర్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ కొనసాగనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement