డివైడర్‌తోపాటు లారీని ఢీకొట్టి.. | Sakshi
Sakshi News home page

డివైడర్‌తోపాటు లారీని ఢీకొట్టి..

Published Sun, Nov 13 2022 1:05 AM

Three Killed Others Injured In Road Accident At Hanamkonda District - Sakshi

కమలాపూర్‌: ఐదుగురితో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ఫ్లయాష్‌ లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామ శివారులో శుక్రవా రం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న గుంటూర్‌పల్లికి చెందిన అన్నెం నాగార్జునరెడ్డి (38) తన భార్యాపిల్లలతో గోపాల్‌పూర్‌ అనుబంధ గ్రామం గుంటూర్‌ పల్లిలో శుక్రవారం తన బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు.

ఫంక్షన్‌ ముగిసిన తర్వాత తన సొంత పనిమీద గోపాల్‌ పూర్‌కు చెందిన చుక్క అశోక్‌ (27), చుక్క అజయ్‌ (25), గుంటూర్‌ పల్లికి చెందిన ఉజ్జేతుల వి జేందర్‌ (35), తాడూరి ప్రవీణ్‌ అనే నలు గురు స్నేహితులతో కలిసి కారులో రాత్రి 11.30 గంటలకు పరకాలకు బయల్దే రారు. ఈ క్రమంలో శనిగరం గ్రామ శివారులోకి వెళ్లగానే రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యాన్ని తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు ఎదురుగా పరకాల నుంచి వస్తున్న ఫ్లయాష్‌ లారీని ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి అందులో ప్ర యాణిస్తున్న అన్నెం నాగార్జున రెడ్డి, చుక్క అజయ్‌లు అక్కడి కక్కడే మృతిచెందారు.

చుక్క అశోక్, ఉజ్జేతుల విజేందర్, తాడూరి ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న క్షతగాత్రు లను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 ద్వారా వరంగల్‌ ఆరెపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తర లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజేందర్‌ మరణించగా..మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు నాగార్జునరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ సంజీవ్‌ తెలిపారు. మృతులు నాగార్జునరెడ్డికి భా ర్య, కూతురు, అజయ్‌కు భార్య, కూతురు, విజేందర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement