
శతాధిక వృద్ధుడైన ఈటల మల్లయ్య.. అనారోగ్యంతో కన్నుమూశారు.
సాక్షి, హనుమకొండ: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పితృవియోగంపై ఈటల రాజేందర్‌ను పలువురు నేతలు పరామర్శించారు. సంతాప సూచికంగా.. కమలాపూర్‌తో పాటు హనుమకొండలో ఇవాళ బిజెపీ చేపట్టాల్సిన నిరసన దీక్షలు రద్దు అయ్యాయి.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. ఇక ఈటల మలయ్య అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హఠాన్మరణం