
సాక్షి, హన్మకొండ: మంచినీటి బావిలో భారీ కొండచిలువ కనిపించడంతో నీటి కోసం వచ్చిన మహిళలు హడలిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. రోజు మాదిరిగానే ఉదయం తాగునీటిని తెచ్చుకోవడానికి మంచినీటి బావి వద్దకు వెళ్లి మహిళలకు అందులో అతిపెద్ద కొండచిలువ కనిపించింది.
దీంతో మహిళలు భయబ్రాంతులై కేకలు వేయడంతో స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు.
చదవండి: వెనక్కి తగ్గిన బీజేపీ.. కేసీఆర్ వైఫల్యాలపై రివర్స్ అటాక్ కు ‘నో’