ఒకే రోజు రెండు ఘోర ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి | Sakshi
Sakshi News home page

ఒకే రోజు రెండు ఘోర ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

Published Fri, Dec 22 2023 4:57 PM

Eight Died In 2 Separate Road Accidents At Hanamkonda And Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిని మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.  క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మృతి చెందిన వారిలో కారులో ప్రయాణిస్తున్న  గుంటూరుకు చెందిన రావు నాగేశ్వరరావు రావు వెంకటేశ్వర్లు, ఆటోలో  ప్రయాణిస్తున్న మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ బాబు, ఆమని గుడిపాడుకు చెందిన ఎనిబెర అభినయ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.. ఆటోలోని నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో వేములవాడ వెళ్తుండగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వస్తున్న ఇసుక లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను మంతెన కాంతయ్య (7 ), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన వందన (16)గా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతున్న వారిలో మంతెన రేణుక (60), మంతెన భార్గవ్ (30), మంతెన శ్రీదేవి (50), ఉన్నారు.

Advertisement
 
Advertisement