సీటు కోసం ఫీట్లు
సంక్రాంతి పండుగ సొంతూరిలో జరుపుకోవాలని ఊరెళ్లేందుకు బస్టాండుకు వచ్చిన వాళ్లకు నరకం కనపడుతోంది. సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండి.. వచ్చిన బస్సులు ఎక్కేందుకు పోటీలు పడి సీట్ల కోసం సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. పిల్లల్ని కిటికీల్లో నుంచి సీట్లలోకి పంపిస్తూ .. తొక్కుకుంటూ..తోసుకుంటూ నానా ప్రయాసలు పడి బస్సెక్కాల్సి వస్తోంది. ఆ తోపులాటల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు నలిగిపోతున్నారు. తీరా ఎక్కినా సీటు దొరక్క ప్రయాణం ఆద్యంతం నిలువు కాళ్లపైనే ఉండాల్సి వస్తోంది. సోమవారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండులోప్రయాణికులు పడిన అగచాట్ల దృశ్యాలివి.
– సాక్షి, ఒంగోలు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు
సీటు కోసం ఫీట్లు


