సమష్టి కృషితో పార్టీ బలోపేతం
మార్కాపురం టౌన్: కార్యకర్తల సమష్టి కృషితోనే పార్టీని బలోపేతం చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అభివృద్ధికి కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. పొగాకు రైతులకు అండగా పొదిలిలో చేపట్టిన విజయవంతమైందని, అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో కూడా మార్కాపురం నియోజకవర్గం మొదటి 5 స్థానాల్లో నిలిచిందన్నారు. ఇది నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త చేసిన కృషేనన్నారు. రానున్న రోజుల్లో పార్టీని అభివృద్ధి చేసి మన గౌరవాన్ని పెంపొందించుకుందామని కోరారు. అందరం సమష్టిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. త్వరలో వార్డు కమిటీల సమావేశంలో కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషేర్ ఆలీబేగ్, మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురలీకృష్ణ, పార్టీ పట్టణ అద్యక్షులు, కౌన్సిలర్ సలీం, వైస్ ఛైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మగ్బుల్ బాషా, కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, సిరాజ్, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, శ్రీనివాసులు, చాటకొండ చంద్ర, నాగరాజు, పార్టీ కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌస్ మొహిద్దీన్, పత్తి రవిచంద్ర, పోరుమామిళ్ల విజయలక్ష్మి, రోజ్ లిడియా, సుస్మిత, చెన్నలక్ష్మి, మహమ్మద్ రఫీ, కరిముల్లా, ఉస్మాన్, రామడుగు రమేష్, దాసరి వెంకటేశ్వర్లు, బూదాల గురవయ్య, ఉత్తమకుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల
పరిష్కారంలో ముందున్నాం
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు


