ఫలితం బండపడి! | - | Sakshi
Sakshi News home page

ఫలితం బండపడి!

Jan 13 2026 5:47 AM | Updated on Jan 13 2026 5:47 AM

ఫలితం బండపడి!

ఫలితం బండపడి!

● పది పరీక్షల్లో పరిస్థితి మెరుగుపడేనా.? ● ఇంటర్‌లో పరువు దక్కేనా ● గతేడాది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పదిలో 9, ఇంటర్‌లో 19 స్థానాలు ● అట్టడుగున నిలిచిన జిల్లా ● ప్రభుత్వ నిర్ణయాలతో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు ● విద్యను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ● బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై ఒత్తిడి

పది మెరుగయ్యేనా...

● పది పరీక్షల్లో పరిస్థితి మెరుగుపడేనా.? ● ఇంటర్‌లో పరువు దక్కేనా ● గతేడాది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పదిలో 9, ఇంటర్‌లో 19 స్థానాలు ● అట్టడుగున నిలిచిన జిల్లా ● ప్రభుత్వ నిర్ణయాలతో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు ● విద్యను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ● బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై ఒత్తిడి
బోధన వెనుకబడి...

ఒంగోలు సిటీ:

జిల్లాలో 636 ప్రభుత్వ ఉన్నత, ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. 29,180 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. టెన్త్‌ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ మొదటి వారం నుంచి వందరోజుల ప్రణాళిక ప్రారంభించినట్టు విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విద్యాశాఖ అధికారులను కాదని ఇతర శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాశాఖలో అధికారులు ఉండగా బయటవారికి బాధ్యతలు అప్పగించడం సరికాదని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జిల్లాలో 109 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. రెండు సంవత్సరాలకు సంబంధించి 41,400 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. గతేడాది ఇంటర్‌, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా అట్టడుగున నిలిచింది. ఈసారైనా పరిస్థితి మెరుగుపడుతుందా అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.

పూర్తిగా దిగజారిన కళాశాల విద్య...

ఉమ్మడి జిల్లాలో 32 ప్రభుత్వ, 77 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. 2025లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 20,344 మంది హాజరుకాగా, 12,711 మంచి విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయిలో 19వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ ఏడాది 22,252 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. 2025లో సీనియర్‌ ఇంటర్‌లో 17,776 మంది పరీక్షలు రాయగా, 13,971 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్‌ విద్యార్థులలో ఈ ఫలితాలు చాలా దిగ్భ్రాంతి కలిగించాయి. ఈ సారైనా పరువు దక్కుతుందా అని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.

సంకల్పం 2026.. గట్టెక్కించేనా.?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణ శాతం పెంచేందుకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ ఏడాది సంకల్ప్‌ 2026 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక కార్యక్రమం 50 రోజుల పాటు ప్రణాళిక రూపొందించి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేస్తోంది. డిసెంబర్‌ 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. అయితే నూతన సిలబస్‌, కొత్త పరీక్షల విధానం కారణంగా ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు సిద్ధం కావడం కత్తి మీద సామేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఉపాధ్యాయులకు ఎక్కువ శాతం బోధనేతర పనులను ప్రభుత్వం అప్పగించింది. దీంతో పలు రకాలుగా ఒత్తిడికి గురైన టీచర్లు హడావిడిగా సిలబస్‌ పూర్తి చేసి మమ అనిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 364 ఉన్నత పాఠశాలలు, 272 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. గతేడాది 29,386 మంది పరీక్షలకు హాజరుకాగా, 25,103 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 85.43 శాతంతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గతేడాది ఫలితాలు అందర్నీ నిరాశపరిచాయి. ఈ ఏడాది 29,180 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా పదో తరగతిలో 91.21 శాతం సాధించి రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచి ప్రశంసలందుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేడు ఆ వెలుగులు ఎక్కడా కనిపించడం లేదని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.

మెరుగైన ఫలితాల సాధనకు కృషి

గతేడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తున్నాం. సంకల్ప్‌ 2026 కార్యక్రమం ద్వారా వెనుకబడిన సీ కేటగిరీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులను నూతన సిలబస్‌తో కొత్త పరీక్షా విధానానికి తగ్గట్టుగా సిద్ధం చేయిస్తున్నాం.

– ఆంజనేయులు, ఆర్‌ఐఓ, ప్రకాశం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement