జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి
ఒంగోలు సబర్బన్: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కే.విజయానంద్ జీఓ విడుదల చేశారు. కల్పనా కుమారి రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేస్తూ జిల్లాకు జేసీగా బదిలీపై వస్తున్నారు. ఈమె ఏపీ కేడర్‌కు చెందిన 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఇప్పటి వరకు సీతంపేట ఐటీడీఏ అధికారిగా, విశాఖపట్నం జేసీగా, నంద్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రోణంకి గోపాల కృష్ణను మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు.
అద్దంకి: ఆంధ్రప్రదేశ్ హిందూ సభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పట్టణానికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసాచారి నియమితులయ్యారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల హిందూ రాష్ట్ర సభ చైర్మన్ నారాయణదాసు జ్యోతి రమణ అధ్యక్షతన కర్నూలు ఆవాపా ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో హిందూసభ జాతీయ అధ్యక్షుడు సౌపర్ణిక విజయేంద్రపురి స్వామి ఆదేశానుసారం నియమించినట్లు తెలిపారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్, నేషనల్ డైరెక్టర్ ఎస్ అరుణ్ కుమార్ జి.చేతుల మీదుగా నియామక పత్రాన్ని శ్రీనివాసాచారికి అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ సేవలందిస్తానని, ఈ పదవి రావడానికి సహకరించిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల చైర్మన్ నారాయణదాసు జ్యోతి రమణ, జాతీయ కమిటీ అధ్యక్షుడు సౌపర్ణిక విజయేంద్రపురి స్వామికి ధన్యవాదాలు తెలిపారు.
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో సోమవారం మోడరన్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సీ్త్ర, పురుషుల రాష్ట్ర స్థాయి మోడరన్ కబడ్డీ జట్ల ఎంపికలు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తేళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎంపికలో పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు కాలేజి ఆవరణలో జరిగే 3వ జాతీయ స్థాయి సీనియర్ సీ్త్ర, పురుషుల మోడరన్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, పీడీ కే శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి
జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి


