నల్లగొండ: జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కొర్లపహాడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి, ముందు వెళ్తోన్న వాహనాన్ని తిరువూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్‌గా బ్రే్‌క్ వేయడంతో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బస్సులు మెల్లగానే వెళ్తూ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు స్వల్ప గాయాలతోనే బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


