నగరంలో ‘అనగనగా ఒక రాజు’
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో సోమవారం రాత్రి అనగనగా ఒక రాజు సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. చిత్ర దర్శకుడు మారి, హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, బాలనటుడు బుట్టిరాజు, చమ్మక్‌చంద్ర అనంత్, కాదంబరి కిరణ్ హాస్యనటులు అభిమానులు పాల్గొని అలరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చక్కని సందేశంతోపాటు వినోదం, హాస్యం మేళవించి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని దర్శకుడు కోరారు. – విద్యారణ్యపురి


