జర్నలిస్టుల భిక్షాటన   | Journalists Begged To Support Family Who Died Due To Covid In HNK | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల భిక్షాటన  

Sep 12 2020 8:18 AM | Updated on Sep 12 2020 8:23 AM

Journalists Begged To Support Family Who Died Due To Covid In HNK - Sakshi

సాక్షి, హన్మకొండ : కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో జర్నలిస్టు బెలిదే శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం జర్నలిస్టులు భిక్షాటన చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ప్రెస్‌ క్లబ్‌ వద్ద మొదలైన భిక్షాటన సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది. శ్రీనివాస్‌ చికిత్స కోసం ఇప్పటికే రూ.20 లక్షల వరకు బిల్లు కాగా, ఆ కుటుంబం డబ్బు చెల్లించలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు దాతలు పెద్ద మనస్సుతో ఆదుకోవాలని వేడుకున్నారు. కాగా, వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యాన శ్రీనివాస్‌ చికిత్స నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. (20 లక్షలు దాటిన కరోనా టెస్టులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement