ఇద్దరు కొడుకులతో కలసి బావిలోకి దూకిన తల్లి  | Sakshi
Sakshi News home page

ఇద్దరు కొడుకులతో కలసి బావిలోకి దూకిన తల్లి 

Published Mon, Feb 13 2023 2:18 AM

Hanamkonda: Woman Throws Two Sons Into Well Jumps To Death - Sakshi

నడికూడ: ఇద్దరు కొడుకులతో కలసి తల్లి బావిలో దూకగా.. ఒక కొడుకు, తల్లి మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామితో దేశాయిపేటకు చెందిన కావ్య అలియాస్‌ లావణ్య (30)కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు విద్యాధర్‌ 3వ తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు శశిధర్‌ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు.

కాగా, కావ్య ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ముందుగా ఇద్దరు కుమారులను బావిలోకి తోసి.. ఆ తర్వాత తానూ బావిలోకి దూకింది. వీరిలో పెద్ద కుమారుడు బావిలోని విద్యు­త్‌ మోటార్‌ పైపును పట్టుకొని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, వ్యవసాయ కూలీలు వచ్చి విద్యాధర్‌ను పైకి తీశారు. అప్పటికే తల్లి, చిన్న కుమారుడు శశిధర్‌ మృతిచెందారు. కావ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొడుకు విద్యాధర్‌ను ప్రశ్నించగా నానమ్మతో తల్లికి గొడవ జరిగిందని తెలిపాడు. మృతురాలు కావ్యకు మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. 

Advertisement
 
Advertisement