రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి | three youth killed in road accident in warangal district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి

Aug 18 2016 9:21 AM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

హన్మకొండ : వేగంగా వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన హన్మకొండలోని నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. న్యూసైన్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సందీప్ (20), భరత్ (20) స్థానికంగా బంగారు పని చేసుకునే అశోక్ (22) తో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి...పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement