breaking news
Three youth killed
-
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి
-
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి
హన్మకొండ : వేగంగా వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన హన్మకొండలోని నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. న్యూసైన్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సందీప్ (20), భరత్ (20) స్థానికంగా బంగారు పని చేసుకునే అశోక్ (22) తో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి...పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్వర్ట్ను ఢీ కొన్న బైక్: ముగ్గురు యువకులు మృతి
అనంతపురం జిల్లా కణేకల్ సమీపంలో ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం బైక్ కల్వర్ట్‌లో పడిపోయింది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఆ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారి సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా ఆ యువకులు అప్పటికే మరణించారు. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకులు మృతదేహలను పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు వెల్లడించారు.