టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన | TRS member widespread | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

Mar 1 2015 2:47 AM | Updated on Sep 2 2017 10:05 PM

టీఆర్‌ఎస్ సభ్యత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు.

హన్మకొండ : టీఆర్‌ఎస్ సభ్యత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. నయీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు వికలాంగులకు ఆయన సభ్యత్వాలు అందజేశారు.
 
 అనంతరం లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. సమావేశంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఆరూరి రంజిత్, బి.వీరేందర్, కత్తరపల్లి దామోదర్‌ౠ చిర్ర రాజు, చిరంజీవి, గణేశ్, ఎల్.రాజేశ్వర్‌రావు, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement