ప్రభుత్వోద్యోగం రాలేదని..  | Sakshi
Sakshi News home page

ప్రభుత్వోద్యోగం రాలేదని.. 

Published Sun, Jan 8 2023 1:05 AM

Man Commits Suicide By Drinking Pesticide In Hanamkonda District - Sakshi

ఐనవోలు: ప్రభుత్వోద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన ఒక యువకుడు పురుగు మందు తాగి చనిపోయాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రా మంలో ఈ ఘటన జ రిగింది, ఎస్‌ఐ వెంకన్న కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రాజ్‌కమల్‌ (25) డిగ్రీ పూర్తి చేసుకుని ప్రభుత్వో ద్యోగాల కోసం ప్ర యత్నిస్తున్నాడు. ఇటీవల పలు నోటిఫికేషన్లు విడుదల కాగా దరఖాస్తు చేసుకున్నాడు.

ప్రభుత్వోద్యోగం రావడం లేదని దిగులుగా ఉండే వాడు. అది గమనించిన రాజ్‌కమల్‌ తల్లిదండ్రులు ఉద్యోగం రాకు న్నా పర్వాలేదని.. ఏదైనా దుకాణం పెట్టు కుని బతకవచ్చని ధైర్యం చెప్పేవారు. దుకాణం నడపడం ఇష్టం లేకపోవడంతోపాటు ఉద్యోగం రాక అందరిలో చులకన అవుతున్నానని మనస్తాపం చెందిన రాజ్‌కమల్‌ ఈ నెల 4న రాత్రి పురుగు మందుల తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement