చంద్రబాబు నాయుడు సమక్షంలో టీటీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చంద్రబాబు సమక్షంలో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
Apr 7 2017 12:21 PM | Updated on Aug 10 2018 9:42 PM
హన్మకొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీటీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించిన అర్షంస్వామి అనే టీడీపీ నేతను పలువురు అడ్డుకోవడంతో.. మనస్తాపానికి గురైన అర్షంస్వామి వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో ఈరోజు జరిగిన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసి తన కష్టాలు చెప్పుకోవాలనుకున్న టీడీపీ నేతను స్థానిక నాయకులు అడ్డుకోవడంతో అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
Advertisement
Advertisement