అక్రమ అరెస్టులకు భయపడేది లేదు
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. 8లో u
బుట్టాయగూడెం: రాజకీయ స్వార్థంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దుద్దుకూరులో ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు తేల్చినా.. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బుకాయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే ఆబద్దాలాడుతున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయంగా వాడుకోవడాన్ని బాలరాజు తీవ్రంగా ఖండించారు. వారు చేస్తున్న దుర్మార్గపు ప్రచారాన్ని ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీస్తున్నారని దానిని దారి మళ్లించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి, హత్యాయత్నం చేయడం, జోగి రమేష్ ఇంటిపైన నిప్పు పెట్టడం చూస్తుంటే ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడం కోసం చేస్తున్న కుట్రలుగా కనిపిస్తున్నాయని చెప్పారు. లడ్డూల్లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా చెబున్నప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. చేసిన తప్పులు ఒప్పుకుని లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శిక్షించే శిక్షలను కూటమి పాలకులు తప్పించుకోలేరని బాలరాజు అన్నారు. ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని అన్నారు.
తెల్లం బాలరాజు,
మాజీ ఎమ్మెల్యే


