నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి

నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి

నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి

ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు పాటు, ట్రైనీ ఐపీఎస్‌ జయాశర్మ, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్‌ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో వి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజలు సమర్పించిన అర్జీలపై అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. ఏ శాఖకు వచ్చిన అర్జీలకు ఆ శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపితే కాల యాపన జరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. అర్జీలకు నిర్ణీత సమయంలోగా నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడే అర్జీదారులు సంతృప్తి చెందుతారని అన్నారు. సోమవారం 392 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సులు తిప్పాలని వినతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కొల్లేరు గ్రామమైన పైడి చింతపాడు నుంచి ఏలూరుకు విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును తిప్పాలని పత్తికోళ్ళలంకకు చెందిన జీ.ఖ్యాతి పుష్పశ్రీ పీజీఆర్‌ఎస్‌ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement