రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి
భీమవరం : రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని రాష్ట్ర అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూప తిరాజు రవీంద్ర రాజు అన్నారు. భీమవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటుచేశారు. జిల్లా చైర్మన్‌గా ఎం.సన్యాసిరావు, సెక్రటరీ జనరల్‌గా జి.పెద్దిరాజు, కన్వీనర్‌గా ఎం.లక్ష్మీనారాయణ, కో–చైర్మన్‌గా ఎం.మోషే, ట్రెజరర్‌గా కె.సుబ్రహ్మణ్యస్వామి, ప్రచార కార్యదర్శిగా పి.సంధ్యారాణి, క్రీడ, సాంస్కృతిక కార్యదర్శిగా కె.ఠాగూర్, ఉప చైర్మన్లుగా ఈ.నాగార్జున, ఎం.నాగరాజు, జి.గోపాలకృష్ణ, బీఎన్‌వీ రత్నారావు, జి.జక్కయ్య ఎన్నికయ్యారు.


