దేవుడిని రాజకీయాల్లోకి లాగడం హేయం | - | Sakshi
Sakshi News home page

దేవుడిని రాజకీయాల్లోకి లాగడం హేయం

Feb 9 2026 7:43 AM | Updated on Feb 9 2026 7:43 AM

దేవుడిని రాజకీయాల్లోకి లాగడం హేయం

దేవుడిని రాజకీయాల్లోకి లాగడం హేయం

చింతలపూడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని, పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయాల్లోకి లాగడం హేయమని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ కంభం విజయరాజు అన్నారు. లడ్డూపై దుష్ప్రచారం సీబీఐ నివేదికతో పటాపంచలైందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై పలు ప్రశ్నలు సంధించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఏ ఆధారంతో అబద్ధాలు చెప్పారు?, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను అపఖ్యాతి పాలుచేసేందుకు లడ్డూ పవిత్రతను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ చార్జిషీట్‌తో స్పష్టమైందని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీకు నైతికత ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చె ప్పాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీరును కూడా విజయరాజు తప్పుబట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టునని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు సనాతన ధర్మం అంటూ రంగులు మారుస్తున్నారని, మెట్లు కడిగి భక్తిని ప్రదర్శించడం కేవ లం డ్రామా మాత్రమే అని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ నైతిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. జెడ్పీటీసీ మొ లుగుమాటి నీరజా సుధాకర్‌ మాట్లాడుతూ కూటమి నాయకుల అబద్ధాలను హిందువులంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరావు, పార్టీ నాయకులు మిర్యాల దిలీప్‌, ఆతుకూరి సుబ్బారావు, పి.మాధవరెడ్డి, కాటూరి ఏరియా, వెంప కృష్ణ, ఎండీ జిలానీ, బండారు గోపి, వెంపా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చింతలపూడి కన్వీనర్‌ విజయరాజు

Advertisement
 
Advertisement
Advertisement