ముగిసిన నాటకోత్సవాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో జరుగుతున్న గరికపాటి కళాపరిషత్ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. రెండు ప్రదర్శనలు సందేశాత్మకంగా ఉన్నాయి. కళాహారతి తిరుమాలి సంస్థ (కాకినాడ) కళాకారులు ప్రియమైన శత్రువు నాటిక ప్రదర్శించా రు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను యువత ఎలా నిర్లక్ష్యం చేస్తుందో చక్కగా ప్రదర్శించారు. గ్రామీణ నాటక సమాఖ్య (పిఠాపురం) వారి సహృదయ ఆర్ట్స్ (పి.రాయవరం) కళాకారులు పున్నామ నరకం నాటికను ప్రదర్శించారు. సీనియర్ రంగస్థల నటుడు కేపీ రాజు, సీనియర్ రంగస్థల నటి యు.విజయలక్ష్మిలను అక్కినేని స్మారక రంగస్థల పురస్కారాలతో సత్కరించారు. సినీ నటుడు సుబ్బరాయ శర్మ, రచయిత గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఎస్ బీఐ రీజనల్ మేనేజర్ పి.కాళిదాసు, కళారత్న ఎస్‌వీ రామారావు, డాక్యుమెంటరీ నిర్మాత జమలాపురం రాధాకృష్ణ, రచయిత పి.రాజేంద్రకుమార్ తదిరులు హాజరుకాగా గరికపాటి ఆర్ట్స్ థియేటర్ డైరెక్టర్ గరికపాటి కాళిదాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 40 కేంద్రా ల్లో ఆదివారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,454 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉ దయం 1,960 మందికి 1,841 మంది, మ ధ్యాహ్నం 1,656 మందికి 1,613 మంది హా జరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగా యని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ఓ ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం కోకో ధరల నిర్ణయ కమిటీ నియమించి సోమవారం సమావేశం నిర్వహించనుందని అయితే కమిటీలో కోకో రైతుల సంఘ ప్రతినిధులను కా కుండా ఆయిల్‌పామ్, కోకో ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించనుండటం అ భ్యంతరకరమని ఏపీ కోకో రైతుల సంఘం రా ష్ట్ర కమిటీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు బొ ల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఆయిల్‌పామ్, కోకో ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కోకో గింజల ధరలు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. పోరాటాల ఫలితంగానే కోకో గింజల ధర పాలసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కోకో రైతుల సంఘ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్ ఏ లూరు సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 23 వరకు స్మార్ట్ మీటర్ల పఖ్వాడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఈ పి.సాల్మన్ రాజు ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతి క సేవలు అందించడం, విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచడం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీ టర్ల వినియోగాన్ని ప్రోత్సహించడం పఖ్వాడా ఉద్దేశమన్నారు. జిల్లాలో వినియోగదారులు స్మార్ట్‌మీటర్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, స్మార్ట్ మీటర్ అమరిక సమయంలో ఈపీడీసీఎల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గేట్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 150 మందికి 131 మంది, సాయంత్రం 150 మందికి 124 మంది హాజరైనట్టు కేంద్రం ప్రిసైడింగ్ అధికారి రాంబాబు తెలిపారు. తుది పరీక్షలు ఈనెల 15, 16వ తేదీల్లో జరుగనున్నాయన్నారు. కో–ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్స్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ ప్రతినిధులు పర్యవేక్షించారు.
తణుకు అర్బన్: మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా తణుకు డిపో నుంచి శ్రీశైలంకు ఈనెల 12, 13, 14 తేదీల్లో సూపర్‌లగ్జరీ, పుష్‌బ్యాక్ 2 ప్లస్ 2 ఆడియో వీడియో కోచ్ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.820, పిల్లలకు రూ.450 అని, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని, మంగళగిరి క్షేత్రాలు దర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ రూపొందించామన్నారు. ఈనెల 14న సాయంత్రం 7 గంటలకు బస్సు బయలుదేరి 16న తణుకు చేరుతుందన్నారు. పుష్‌బ్యాక్ బస్సు టికెట్ ధర రూ.2,200గా నిర్దేశించామని తెలిపారు.


