తంగెళ్లమూడి..భక్తులతోనిండి | - | Sakshi
Sakshi News home page

తంగెళ్లమూడి..భక్తులతోనిండి

Feb 9 2026 7:43 AM | Updated on Feb 9 2026 7:43 AM

తంగెళ

తంగెళ్లమూడి..భక్తులతోనిండి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో గంగానమ్మవారి జాతర మహోత్సవాలు వరుసగా మూడో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. గతనెల 26న తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్‌పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపుపేట, ఈనెల 1న పడమరవీధి గంగానమ్మ జాతరలు జరిగాయి. చివరగా తంగెళ్లమూడి గంగానమ్మ వారి జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. నగరంలో సుమారు 100 రోజులకు పైగా ఆయా ప్రాంతాల్లో జాతరలు జరగ్గా తంగెళ్లమూడిలో జాతరతో ఉత్సవాలు ముగియనున్నాయి.

గతనెల 11 నుంచి..

తంగెళ్లమూడి ప్రాంతంలోని యాదవ్‌నగర్‌లో గత నెల 11న అమ్మవారు పాదం మోపే కార్యక్రమంతో జాతర మొదలైంది. అప్పటి నుంచి ప్రత్యేక పూజ లు, భక్తుల నైవేద్యాల సమర్పణలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. జాతర సందర్భంగా అమ్మ వారి మేడల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరు కుని నైవేద్యాలు, చీరెలు, సారెలు సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. తంగెళ్లమూడి, యాదవనగర్‌, ఖండ్రికగూడెం, బీడీ కాలనీ, టైటస్‌ నగర్‌, పుష్పలీలానగర్‌, రాణీనగర్‌, దాదా పలావ్‌ సెంటర్‌, ద్వారకానగర్‌, కుమ్మరిరేవు, తాపీమేసీ్త్ర కాలనీ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చా రు. భక్తులు సమర్పించిన నైవేద్యాలతో భారీ కుంభాలు రాశులుగా ఏర్పడ్డాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో తంగెళ్లమూడి కిటకిటలాడింది. ట్రాఫిక్‌ గంటల కొద్దీ నిలిచిపోయింది. ప్రధానంగా తంగెళ్లమూడి వంతెన దాటడానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తంగెళ్లమూడి నుంచి దాదా పలావ్‌ సెంటర్‌ వైపు సైతం ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. పోలీసుల చర్యలతో ట్రాఫిక్‌ వలయం నుంచి ప్రజలు బయటపడగలిగారు.

గంగానమ్మా.. దీవించమ్మా..

తంగెళ్లమూడిలో గంగానమ్మ జాతర

ఏలూరులో వరుసగా మూడో ఆదివారం జాతర సందడి

పోటెత్తిన భక్తులు

తంగెళ్లమూడి..భక్తులతోనిండి 1
1/1

తంగెళ్లమూడి..భక్తులతోనిండి

Advertisement
 
Advertisement
Advertisement