ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను | - | Sakshi
Sakshi News home page

ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను

Feb 9 2026 7:43 AM | Updated on Feb 9 2026 7:43 AM

ప్రసా

ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను

డాక్యుమెంట్లు తప్పనిసరి

విష ప్రచారం మొదలు

ద్వారకాతిరుమల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ ఆలయాలపై రాజకీయ నాయకుల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు చోటా నాయకులు సైతం దేవస్థానం అధికారులపై పెత్తనం చేస్తూ పైరవీలు సాగిస్తున్నారు. తాము చెప్పిన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ఒకటైన చిన్నతిరుపతి (ద్వారకాతిరుమల) శ్రీవారి దేవస్థానంలో ప్రసాదాలు తయారీ టెండర్‌ విషయంలో అధికారులు ఈ తరహా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నేతల ఆదేశాలకు తలొగ్గని అధికారులపై కొందరు వ్యక్తులు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా అవినీతి ఆరోపణలు పాల్పడటం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి దేవస్థానంలో ద్వారకాతిరుమలకు చెందిన రవికృష్ణ మేన్‌ పవర్‌ ఏజెన్సీస్‌ 2024 ఏప్రిల్‌ 1 నుంచి ప్రసాదాల తయారీ కాంట్రాక్టును నిర్వహిస్తోంది. అప్పటి నుంచి ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా ప్రసాదాల నాణ్యత, రుచిలో ప్రథమ ర్యాంక్‌ లభించింది. ఈ ఏజెన్సీస్‌ కాంట్రాక్ట్‌ గడువు వచ్చేనెల 31వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు గతనెల 23 నుంచి ప్రారంభించిన కొత్త టెండర్‌ ప్రక్రియ ఈనెల 5వ తేదీతో ముగిసింది. 6న టెక్నికల్‌ బిడ్‌ను ఓపెన్‌ చేశారు.

మా వాళ్లకే టెండర్‌ ఇవ్వాలంటూ..

విజయవాడకు చెందిన ఎం.విజయచంద్‌ సప్లయిర్స్‌, ఎం.రవికుమార్‌, జీకే మేన్‌ పవర్‌, ద్వార కాతిరుమలకు చెందిన రవికృష్ణ మేన్‌ పవర్‌ ఏజెన్సీస్‌ టెండర్‌లో పాల్గొన్నారు. అయితే ఏమైనా లో టుపాట్లు ఉన్నా తమ వాడికే కాంట్రాక్టును కట్టబెట్టాలంటూ కొందరు పచ్చ నేతలు కొద్దిరోజులుగా అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే టెక్నికల్‌ బిడ్‌లో సరైన పత్రాలు సమర్పించని వారిని (ఇద్దరు ఏఈఓలు, సూపరింటెండెంట్‌, జూనియర్‌ అకౌంట్‌ అధికారితో కూడిన) కమిటీ తిరస్కరిస్తుందని, తమ చేతిలో ఏమీ ఉండదని అధికారులు చెబుతున్నా ఆ నేతలు వినిపించుకోవడం లేదట. ఆన్‌లైన్‌ టెండర్‌ విషయంలో పొరపాట్లు జరిగితే తమ ఉద్యోగాల మీదకు వస్తుందని, అలాగని అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎన్నడూ లేనివిధంగా..

ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దేవస్థానంపై రాజకీయ క్రీనీడ పడుతోంది. తమ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని కొందరు నాయకులు అధికారులను ఆదేశించే స్థాయికి వచ్చింది. అయితే అలాంటివి ఇక్కడ చెల్లవని పలువురు అధికారులు అంటున్నారు. ని యమ, నిబంధనలకు లోబడే కాంట్రాక్టులను అప్పగిస్తామని చెబుతున్నారు.

ఆరోపణల్లో వాస్తవం లేదు

రవికృష్ణ మేన్‌ పవర్‌ ఏజెన్సీస్‌ పీఎఫ్‌, ఈఎస్‌ఐలు కట్టకుండా అధికారులు బిల్లులు చెల్లించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ వివరణ ఇచ్చారు. అన్నీ పరిశీలించిన తరువాతే బిల్లులు చెల్లించామన్నారు. ఆన్‌లైన్‌ టెండర్‌లో అవకతవకలు జరగవని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం

టెండర్‌ వేసిన కాంట్రాక్టర్‌ తప్పనిసరిగా డిపాజిట్‌ రూ.3 లక్షలు చెల్లించిన ఈఎండీ చలా నా, ఆధార్‌, పాన్‌కార్డ్‌, జీఎస్టీ, ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌, మేన్‌ పవర్‌ సర్టిఫికెట్లు, ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సర్టిఫికెట్లు, వాటికి సంబంధించిన తాజా చలానాలు, అ లాగే ఆర్‌జేసీ, డీసీ కేడర్‌కు చెందిన ఆల యాల్లో గడచిన రెండేళ్లలో ప్రసాదాలు త యారు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం, మూడేళ్ల ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్స్‌, తహసీల్దార్‌ జారీ చేసిన రిలీజియస్‌ సర్టిఫికెట్‌, నోటరీ (హిందూ) అఫిడవిట్‌, సెల్ఫ్‌ డిక్లరేషన్‌, ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌, ఫర్మ్‌ ఏ సంస్థలోనూ బ్లాక్‌ లిస్ట్‌లో లేదని రూ.100ల స్టాంప్‌ పేపర్‌పై నో టరైజ్డ్‌ అఫిడవిట్‌ను సమర్పించాలి. ఈ పత్రాలన్నీ ఉన్న వారినే కమిటీ ప్రైజ్‌ బిడ్‌కు అనుమతించాలి. అక్కడ తక్కువ ధరకు ఎవరు కోట్‌ చేస్తారో వారికే కాంట్రాక్టును ఇవ్వాలి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి కాంట్రాక్ట్‌ అప్పగిస్తారా.. లేక పచ్చ నేతల ఆదేశాలకు తలొగ్గి అనర్హులకు కాంట్రాక్ట్‌ కట్టబెడతారా.. అన్నది వేచి చూడాల్సి ఉంది.

చినవెంకన్న ప్రసాదాల కాంట్రాక్ట్‌ కోసం యత్నాలు

తమ వారికే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు

నిబంధనలు పాటిస్తామంటున్న అధికారులపై అవినీతి ఆరోపణలు

ఆలయాలపై విపరీతంగా పెరిగిన రాజకీయ నాయకుల జోక్యం

తలలు పట్టుకుంటున్న దేవస్థానం అధికారులు

అధికారులు తమకు సహకరించడం లేదన్న అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తు లు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా విష ప్రచారానికి పాల్పడ్డారు. ప్రస్తుత రవికృష్ణ మేన్‌ పవర్‌ ఏజెన్సీస్‌ కాంట్రాక్టర్‌ వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి అని, గత 22 నెలలుగా కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐలు చెల్లించడం లేదని, అయినా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని దేవస్థానం చైర్మన్‌, ఈఓలకు వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టారు. అధికారులు కుమ్మకై , బేరం మాట్లాడుకుని మళ్లీ అతడికే టెండర్‌ను అప్పగించేందుకు ప్రయత్ని స్తున్నారని ఆ మెసేజ్‌లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు.

ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను 1
1/1

ప్రసాదాలపై పచ్చ నేతల కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement