కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
నలుగురు విద్యార్థులకు గాయాలు
దెందులూరు: కాలేజీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై పెదవేగి మండలం దుగ్గిరాల సర్వీస్ రోడ్డువద్ద సోమవారం డిపాల్ కాలేజీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైసీపీ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఏలూరు సర్వజన వైద్యశాలకు తరలించారు. ముగ్గురు వైద్యం చేయించుకుని డిశ్చార్జి కాగా, ఒక విద్యార్థి వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
చాట్రాయి: చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని నరశింహారావు సొసైటీలో గత డిసెంబర్ 25న చోరీ జరిగినట్లు తెలిపారు. తాళం పగల కొట్టి లోపల బీరువాలో ఉన్న రూ 1.40 లక్షల నగదు చోరీకి గురైందన్నారు. సొసైటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. అనుమానితులపై ప్రత్యేక నిఘాపెట్టి నిందితుడు గ్రామానికి చెందిన నక్కా గంగాధరావుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రూ 1.40 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రంలోని వీరేశ్వరస్వామి, భావన నారాయణ స్వామి క్షేత్రాలకు సంబంధించి హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర కుచ్చరకోట వీరభద్రరావు, ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వీరేశ్వరస్వామి దేవస్థానం హుండీల ఆదాయం రూ. 5,73,460, భావన నారాయణ స్వామి క్షేత్రం ఆదాయం రూ. 38,915 వచ్చినట్లు ఈవో తెలిపారు.
నూజివీడు: వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం సాయంత్రం నూజివీడు పట్టణంలో చోటుచేసుకుంది. హనుమంతులగూడెంకు చెందిన పులపాక నవ్య(21) తన తల్లితో కలిసి పట్టణంలోని స్టేషన్‌తోట ప్రాంతంలోని సాయిబాబు గుడి ఏరియాలో అద్దెకు ఉంటూ బీఎస్సీ నర్సింగ్ చదువుతూనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2018లో రజకపేటలో అద్దెకు ఉన్న సమయంలో వివాహమై ఇద్దరు పిల్లలున్న బండారు సురేష్‌కుమార్ (30) నవ్యకు పరిచయమయ్యాడు. కొంతకాలానికి అతడు అల్లరి చేస్తుండటంతో ఆమె అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వేరేచోటకు వెళ్లిపోయారు. నువ్వంటే నాకిష్టం, నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 8న సాయంత్రం నవ్య కొప్పుల వెలమపేటలో ఉంటున్న ఆమె మామయ్య ఇంటికి నడిచి వెళ్తుండగా సురేష్ ఆమైపె చాకుతో దాడి చేయగా త్రుటిలో తప్పుకోవడంతో కాలిపై గాయమైంది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ పీ సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
పాస్టర్ పరంజ్యోతి మృతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని బెనీలా ప్రార్థనా మందిరం పాస్టర్ ఎం పరంజ్యోతి ఆదివారం మృతిచెందారు. సోమవారం సాయంత్రం వరకు ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో ఉంచారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ప్రఖ్యాత సంగీత దర్శకునిగా, ఆరాధకునిగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సమాజానికి పరిచితులు. పరంజ్యోతి శాంతినగర్‌లోని మన్నా చర్చి బిషప్ ముంగడం ఎలీషా రాజు ప్రథమ కుమారుడు.
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ


