ఆంధ్ర బౌలింగ్ కోచ్‌గా నాగవర్మ
ఏలూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టు బౌలింగ్ కోచ్‌గా పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన మట్టా నాగవర్మ నియమితులయ్యారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అంతర రాష్ట్ర అండర్–14 బాలుర క్రికెట్ పోటీల్లో నాగవర్మ పాల్గొంటారు. నాగవర్మ వద్ద శిక్షణ పొందిన పలువురు క్రికెటర్లు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
భీమడోలు : భీమడోలు ఈతకోటవారి వీధిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. పొల్నాటి శ్రీనివాస్ ఇంట్లోని ఆరు కాసుల బంగారు అభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన తాపీమేస్త్రి పొల్నాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మేనల్లుడి ఇంట్లో నిశ్చితార్ధానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నల్లపూసల తాడు, బంగారు చైన్‌లు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మదీనా బాషా తెలిపారు.


