స్కూల్‌ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు బోల్తా

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 7:46 AM

స్కూల్‌ బస్సు బోల్తా

స్కూల్‌ బస్సు బోల్తా

స్కూల్‌ బస్సు బోల్తా ఏడు బార్ల కేటాయింపు కొనసాగిన ప్రాక్టికల్స్‌ తత్కాల్‌లో ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ఆటోమేషన్‌తో భారం

చాట్రాయి: మండలంలోని గుడిపాడులో ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట సిద్ధార్థ స్కూల్‌, కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబో యి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొ ట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రామృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

ఏలూరు (మెట్రో): జిల్లాలో ఏడు మద్యం బార్ల కేటాయింపును లాటరీ పద్ధతి ద్వారా పూర్తిచేసినట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రక్రియను నిర్వహించారు. ఏలూరు స్టేషన్‌ పరిధిలో 6, జంగారెడ్డిగూడెం స్టేషన్‌ పరిధిలో ఒక బార్‌ కోసం 28 దర ఖాస్తులు వచ్చాయన్నారు. లాటరీ పద్ధతిలో వీటిని బసు సాంబశివరావు, ఎరకల నాగ వెంకట కామాక్షి, సుంకర శ్రీదేవి, తల్లూరి శివ రామారావు, ఎరగ్రోగు భానుప్రకాష్‌, ఆరేపల్లి సంతోష్‌కుమార్‌, మద్దుల జగదీశ్వర వేణుగోపాల్‌కు కేటాయించామన్నారు. జిల్లా ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికారి ఎ.ఆవులయ్య, ఎకై ్సజ్‌ సీఐలు జి.శ్రీకృష్ణ ధనరాజు, కె.శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 34 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు 2,782 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 1,248 మందికి 1,228 మంది, మధ్యాహ్నం 1,586 మందికి 1,554 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పరీక్ష ఫీజులను తత్కాల్‌ విధానంలో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుంలో ఈనెల 12 వరకు చెల్లించవచ్చని సూచించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాంటూ ఏపీటీఎఫ్‌ నగర శాఖ నాయకులు గురువారం నగర కమిషనర్‌ భానుప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓపీఎస్‌ ఉపాధ్యాయులకు డీఏ ఏరియర్స్‌ను జమచేయాలని కోరారు. ఒక నెల బిల్లు సబ్మిట్‌ చేసినా నగదు జమకాలేదన్నారు. అలాగే సీపీఎస్‌ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సంబంధించిన మూడు బిల్లులు సమర్పించగా 90 శాతం నగదు జమకాలేదన్నారు. పీఎఫ్‌ రుణా లు మంజూరు చేయాలని కోరారు. అధ్యక్షుడు కురమ ఆనంద్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేషన్‌ ఆటోమేషన్‌ విధానం ఉపాధ్యాయులకు భారం కానుందని ఏపీటీఎఫ్‌–1938 రాష్ట్ర అకడమిక్‌ కమిటీ కన్వీనర్‌ గుగులోతు కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ.రామ్మోహన్‌, జి.మోహన్‌ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోమేషన్‌ పేరుతో జిల్లా, మండల విద్యాశాఖ అధి కారుల పాత్రను తగ్గించడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement