టీడీపీ అరాచకాలకు భయపడం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలకు భయపడం

Feb 6 2026 7:46 AM | Updated on Feb 6 2026 7:46 AM

టీడీపీ అరాచకాలకు భయపడం

టీడీపీ అరాచకాలకు భయపడం

టీడీపీ అరాచకాలకు భయపడం

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై దాడి, ఇల్లు, కార్యాలయాలపై దాడు లు, విధ్వంసం చేసిన టీడీపీ గుండాలపై ప్ర భుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) డిమాండ్‌ చేశారు. జిల్లాకు చెందిన పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, ఏలూరు కన్వీనర్‌ మామిళ్లపల్లి జయప్రకాష్‌ (జేపీ) పార్టీ నేతల బృందం గురువారం అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. దాడుల ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. ధ్వంసమైన కారు, ఇంటి పరిసరాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు చేసిందని, అయితే సీబీఐ, సిట్‌ నివేదికతో సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని తేలిందన్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో పరువుపోయిన ప్రభుత్వం దానిని కప్పిబుచ్చుకునేందుకు వైఎ స్సార్‌సీపీ నేతలు, వారి ఇళ్లపై దాడులకు తెగబడుతోందన్నారు. అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లించాలనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను భయపెట్టాలని చూడటం మానుకోవాలన్నారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల శంకర్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్‌ ఉన్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబానికి పరామర్శ

వైఎస్సార్‌సీపీ జిల్లా నేతల బృందం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు దాడి జరిగిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి కారిడార్‌లో పెట్రోల్‌ బాంబులతో దాడి చేసి దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.

మాజీ మంత్రుల కుటుంబాలకు జిల్లా నేతల పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement