కోకో ధర తగ్గింపు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కోకో ధర తగ్గింపు అన్యాయం

Feb 8 2026 4:27 AM | Updated on Feb 8 2026 4:27 AM

కోకో ధర తగ్గింపు అన్యాయం

కోకో ధర తగ్గింపు అన్యాయం

కోకో ధర తగ్గింపు అన్యాయం

పెదవేగి: కొనుగోలు కంపెనీలు కోకో గింజల ధర లు తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్‌ చేసింది. శనివారం విజయరాయిలోని గాంధీనగర్‌ సీతారామ కల్యాణ మండలపంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ధర నిర్ణయంపై ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశంలో తీసుకోవాల్సిన చర్య లు గురించి చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కోకో రైతులతో సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో కంపెనీలు ధరలు ఎలా తగ్గిస్తాయని ప్రశ్నించారు. కిలో గింజలకు ధరను రూ.400 నుంచి రూ.380కు తగ్గించారని, దీనిపై ప్రశ్నిస్తే అంతర్జాతీయ మార్కెట్‌ ధర తగ్గిందని చెప్పడం అన్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో జనవరిలో రూ.550 ధర ఉంటే రూ.350లకే కొనుగోలు చేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా రైతులకు ధరలు చెల్లించడం లేదన్నారు. ధరలు తగ్గించడం సరికాదని దీనిపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు భ విష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్‌బాబు, పాలడుగుల నరసింహారావు, నాయకులు బొప్పన పూర్ణచంద్రరావు, కూరపాటి ధర్మారావు, బొప్పన శివరాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement