అదే పోరుబాట
న్యూస్‌రీల్
నమో వేంకటేశా..
నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద్వారకాతిరుమల క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 8లో u
ఏజెన్సీలో ఆయుధ డిపో ఏర్పాటుపై తారాస్థాయిలో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. గిరిజనుల అభీష్టం, గ్రామసభల తీర్మానానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న అడుగులను పోరుబాటతో గిరిజనులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే జీలుగుమిల్లిలో ఆయుధ డిపోకు వ్యతిరేకంగా తారాస్థాయిలో ఉద్యమాలు నిర్వహించడంతో ప్రతిపాదనను జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడేనికి మార్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ ఆదేశాలతో అధికారులు హడావుడిగా సర్వేలు నిర్వహిస్తుండటంతో కొయ్యలగూడెంలోనూ పోరుబాట ఉధృతమైంది.
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
రైతుల భారీ ప్రదర్శన (ఫైల్)
సాక్షిప్రతినిధి, ఏలూరు: నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి భూసేకరణ తీవ్ర వివాదస్పదంగా మారింది. దాదాపు రెండేళ్ల నుంచి ఏజెన్సీలో గిరిజనులు, గిరిజనేతరులు వ్యతిరేకంగా పో రాడుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చినా రైతులు సుముఖంగా లేకపోవడంతో అప్పటి కలెక్టర్ ప్రతిపాదనను తిరస్కరించి కేంద్రానికి పంపారు. అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఏలూరు ఎంపీ పుట్టా ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకుని హడావుడి చేశారు. తొలుత జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలో 1,016 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి భూసేకరణకు ఆదేశాలు ఇచ్చారు. జీలుగుమిల్లి మండలంలో గ్రామసభలు నిర్వహించి ప్రతిపాదనలను తిప్పికొట్టడానికి రైతులు, గ్రామస్తులు ప్రయత్నించినా సర్కారు మాత్రం వెనక్కి తగ్గకుండా బలంగా ఒత్తిడి తెచ్చింది. పలు రకాలుగా రైతులను దారికి తెచ్చి భూసేకరణకు ప్రయత్నించినా అక్కడ పోరుబాట తారాస్థాయికి చేరడంతో ప్రతిపాదనలు విరమించుకున్నారు. ఇంతటితో ఆగకుండా కొయ్యలగూడెం మండలానికి ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు.
కొయ్యలగూడెంలో ఆగ్రహ జ్వాలలు
కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల సరిహద్దు గ్రామాల్లో భూసేకరణ చేసి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మళ్లీ వివాదం రేగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం పరిగణనలోనికి తీసుకోకుండా ఎంపీ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలున్నా యి. ఈ పరిణామాల క్రమంలో జీలుగుమిల్లిలో భూసేకరణ నిలిపివేసి కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్‌నగర్, రేగులగుంట, ఊట్లగూడెం, త్రినాథపురంలో 1,200 ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించాలని నిర్ణయించి హడావుడిగా సర్వే చేపట్టి నివేదికలు సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు, ముందస్తు సమాచారం లేకుండా రెండు పంటలు పండే భూములను ఎలా ఇస్తామంటూ రైతులు తిరగబడుతున్నారు. గత వారం వందలాది మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బోడిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు పార్టీలకు అతీతంగా రైతులు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి తక్షణమే ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామసభల ద్వారా తీర్మానం చేసి తిప్పికొట్టాలని నిర్ణయించారు. వర్జీనియా పొ గాకు, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, అరటి, కోకో, కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు పండే సారావంతమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వ బోమని రైతులు అంటున్నారు.
ఆయుధ డిపో మాకొద్దు
జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడేనికి ఆయుధ డిపో షిఫ్ట్
హడావుడిగా కొయ్యలగూడెంలో సర్వే
6 గ్రామాల్లో 1,200 ఎకరాల సేకరణకు ప్రయత్నాలు
రైతులు వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకెళ్తున్న సర్కారు
ఆయుధ డిపోపై ఎంపీ పుట్టా పట్టు
గ్రామసభల్లో వ్యతిరేక తీర్మానాలకు పంచాయతీలు సిద్ధం
అదే పోరుబాట
అదే పోరుబాట


