బాలుడి మృతిపై సమగ్ర విచారణ చేయిస్తా..
కలెక్టర్ వెట్రిసెల్వి హామీ
పెదవేగి: పెదవేగిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న అజిత్ మరణంపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్ కె.వెట్రిసెల్విని కోరారు. ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం వారు కలెక్టర్‌ను కలిసి తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, తమ కుమారుడి మృతిపై సమగ్ర విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. అజిత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుందని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కు మార్చినట్టు పేర్కొన్నారు. 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఉన్నందున ఈ మార్పు చేసినట్టు స్పష్టం చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 639 మందికి 233 మంది, 11వ తరగతిలో ప్రవేశాలకు 677 మందికి 151 మంది హాజరయ్యారన్నారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు కేంద్రాలను సందర్శించారని తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వం ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్–2026 అమలుచేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ముసాయిదా నిబంధనలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల భద్రతకు ముప్పుగా పరిణమించనున్నాయని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఈ. రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం కోరిందని, ఈ నిబంధనలు తీవ్రనష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్స్‌ట్రార్డినరీ లీవ్, 33 ఏళ్ల సేవ పూర్తయితే బలవంతపు రిటైర్‌మెంట్ వంటి పలు నిబంధనలు ప్రమాదకంగా ఉన్నాయని తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 49 కేంద్రాల్లో శనివారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 4,363 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,514 మందికి 2,391 మంది, మధ్యాహ్నం 2,018 మందికి 1,972 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ఓ ప్రకటనలో తెలిపారు.
భీమవరం: ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు యాళ్ల మోహనరావు, గుమ్మల్ల జకరయ్య కోరారు. శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లు, ఆర్థిక ప్రయోజనాలు, వేతన సవరణ క మిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి తదితర అంశాలపై రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోరారు. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్/జీపీఎస్ విధానాలపై పునః సమీక్ష చేయాలన్నారు. ఉద్యోగుల స మస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, సభలో ప్రస్తావిస్తామని మోషేన్‌రాజు, గోపి మూర్తి హామీ ఇచ్చారని నేతలు తెలిపారు.


