నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భీమవరం రానున్నారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు తనయుడు ఐపీఎస్‌ అధికారి చిట్టిరాజు వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు స్థానిక పెదఅమిరం రోడ్డులోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సమీపంలోని రాధాకృష్ణ కన్వెన్షన్‌ హాలుకు కారులో చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 12 గంటలకు భీమవరం నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఈ మేరకు జగన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైనట్టు పార్టీ నేతలు తెలిపారు. అభిమాన నేత రాక కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఘనంగా స్వాగత ఏర్పాట్లు:

జగన్‌ పర్యటన కోసం మండలి చైర్మన్‌ మోషేనురాజు, పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. వివాహ వేదిక ఉన్న పెదఅమిరం రోడ్డు దారిపొడవునా స్వాగత ఫ్లెక్సీలతో ముంచెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరానున్నారు.

హెలీప్యాడ్‌ పరిశీలన

హెలీప్యాడ్‌ స్థలాన్ని బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చినమిల్లి వెంకటరాయుడు తదితరులు పరిశీలించారు. జగన్‌ను కలిసేందుకు భారీ ఎత్తున నేతలు తరలిరానుండటంతో ఏర్పాట్లపై సమీక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల నరసింహరాజు, జిల్లా అధికారప్రతినిధి కామన నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

మండలి చైర్మన్‌ మోషేనురాజు తనయుడి వివాహ వేడుకకు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement