ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డిదొర | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డిదొర

Feb 9 2026 7:43 AM | Updated on Feb 9 2026 7:43 AM

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర  కార్యదర్శిగా రెడ్డిదొర

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డిదొర

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డిదొర

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శిగా బీ. రెడ్డి దొర ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం వివరాలను ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామారావు ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఏపీటీఎఫ్‌ ఏలూరు జిల్లా అధ్యక్షునిగా పని చేస్తున్న బీ. రెడ్డిదొర రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడలో జరిగిన కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన సీహెచ్‌వీ సత్యనారాయణ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, అలాగే భాస్కర వర్మ జీఓ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని తెలిపారు. రాష్ట్ర కమిటీకి వివిధ పదవులకు ఎన్నికై న ఏపీటీఎఫ్‌ నాయకులకు జిల్లా సబ్‌ కమిటీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement