ఆటపాకలో పర్యాటకుల సందడి | - | Sakshi
Sakshi News home page

ఆటపాకలో పర్యాటకుల సందడి

Feb 9 2026 7:43 AM | Updated on Feb 9 2026 7:43 AM

ఆటపాక

ఆటపాకలో పర్యాటకుల సందడి

కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సమీప జిల్లాల నుంచి వచ్చిన యాత్రికులతో కేంద్రం కళకళలాడింది. బోటు షికారులో పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షుల కేరింతలను దగ్గర నుంచి ఆశ్వాదించారు. కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను ఎక్కువమంది తిలకించారు. చిల్డ్రన్స్‌ పార్కులో చిన్నారులు, పెద్దలు ఆటలాడుకున్నారు. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ రాజేష్‌, సిబ్బంది కొల్లేరు భౌగోళిక పరిస్థితులు, విదేశీ, స్వదేశీ పక్షుల విశేషాలను వివరించారు. పక్షుల వీక్షణకు అనువైన శీతాకాలం కావడంతో పక్షి ప్రేమికులు సందర్శించాలని కోరారు.

ఆటపాకలో పర్యాటకుల సందడి 1
1/1

ఆటపాకలో పర్యాటకుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement