ఎఫెక్ట్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ‘స్తంభాలపై ప్రమాద ఘంటికలు’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ఈ నెల 3న ప్రచురించిన కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కట్టిన కేబుల్ వైర్లను తొలగించారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తాకుతున్న చెట్ల కొమ్మలను సైతం తొలగించారు. ఈపీడీసీఎల్ ఏలూరు నార్త్ ఏఈ రాంబాబు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలకు చుట్టిన కేబుల్ వైర్లకు సంబంధించిన సంస్థలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. తమ ప్రాంతంలో విద్యుత్ వైర్లను చెట్ల కొమ్మలు తాకుతున్న విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని తొలగించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎఫెక్ట్


