నెట్‌బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక
భీమవరం: ఇటీవల వాసవి పెనుగొండలో జరిగిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజి నెట్‌బాల్ సెలెక్షన్లో డాక్టర్ సీఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎం ఎస్తేరు రాణి రాణించి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సకుమళ్ళ సత్యనారాయణ తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్, కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని స్టెల్లా కళాశాలలో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళల జట్టుకు ఎం ఎస్తేరు రాణి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఎస్తేర్ రాణిని కళాశాల సెక్రెటరీ – కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో ట్రెజరర్ వడుపు గోపి, పీడీ దావూద్ ఖాన్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


