కై కలూరు సర్పంచ్‌ను కొనసాగించాలంటూ తీర్పు | - | Sakshi
Sakshi News home page

కై కలూరు సర్పంచ్‌ను కొనసాగించాలంటూ తీర్పు

Feb 7 2026 10:01 AM | Updated on Feb 7 2026 10:01 AM

కై కల

కై కలూరు సర్పంచ్‌ను కొనసాగించాలంటూ తీర్పు

కై కలూరు సర్పంచ్‌ను కొనసాగించాలంటూ తీర్పు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 3,924 మంది హాజరు డిజిటలైజేషన్‌ చేయాలి కాపు నేతలపై వేధింపులు పాస్‌ పుస్తకాలపై నిర్లక్ష్యం సహించం నేడు కోకో రైతుల సమావేశం

కై కలూరు: నిధుల దుర్వినియోగం అంశంపై వైఎస్సార్‌సీపీ పాలనలో ఎన్నిౖకైన కైకలూరు సర్పంచ్‌ దానం మేరీ నవరత్నకుమారిని గతేడాది జూన్‌ 19న కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సస్పెండ్‌ చేశారు. అంతకు ముందు 2025 జనవరి 18న సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను కూడా రద్దు చేశారు. దీనిపై సర్పంచ్‌ న్యాయపోరాటం చేశారు. న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ను విధు ల్లో కొనసాగించాలంటూ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌, ఏలూరు కలెక్టర్‌కు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేవలం రాజకీయ కారణాలతోనే సర్పంచ్‌ పదవి నుంచి పిటిషనర్‌ను తొలగించారని, ఎలాంటి ప్రామాణికమైన విచారణ పాటించలేదని న్యాయవాది వాదించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సర్పంచ్‌ మేరీ నవరత్నకుమారి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలతో సర్పంచులు, జెడ్పీటీసీలను వేధిస్తున్న నాయకులకు ఈ తీర్పు గుణపాఠం కావాలన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 52 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు 3,924 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 2,242 మందికి 2,124 మంది, మధ్యాహ్నం 1,842 మందికి 1,800 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను ప్రకటనలో తెలిపారు.

ఏలూరు(మెట్రో): ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డులన్నింటినీ డిజిటలైజ్‌ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌ నుంచి రికార్డుల డిజిటలైజేషన్‌పై అధికారుల తో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

చింతలపూడి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజికవర్గంపై సాగిస్తున్న వివక్షాపూరిత చర్యలను వైఎస్సార్‌సీపీ జిల్లా మున్సిపల్‌ విభా గం అధ్యక్షుడు, కాపు నేత బొడ్డు వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాపు నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ప్రకటనలో తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నేతల కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమన్నారు. టీడీపీ, జనసేనలో ఉన్న కాపు నేతలు కేవలం ఆయా పార్టీలకు ‘కాపలా’ కాయడానికే పరిమితమా? అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతలపై అరాచకాలను సహించబోమని, ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే ఐక్యంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా కాపులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఏలూరు(మెట్రో): పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల ఈకేవైసీ, పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ, ఈకేవైసీపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించాఆరు. ఈకేవైసీని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వెనుకబడి ఉన్న టి.నరసాపురం, ఆగిరిపల్లి, జీలుగుమిల్లి, ముసునూరు తదితర మండలాల తహసీల్దార్లు ప్రగతి చూపాలని, లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్‌ అంబరీష్‌, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

పెదవేగి: విజయరాయి గాంధీనగర్‌లోని సీతారామ కల్యాణ మండపం వద్ద శనివారం కోకో రైతుల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్‌ శుక్రవా రం ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర తగ్గింపుపై ఈ సమావేశంలో చర్చిస్తారని, ప్రభుత్వం ఇంతవరకూ ధరల పాలసీ ప్రకటించలేదని, ధర నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన చేశారు. సమావేశంలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.

కై కలూరు సర్పంచ్‌ను కొనసాగించాలంటూ తీర్పు 1
1/1

కై కలూరు సర్పంచ్‌ను కొనసాగించాలంటూ తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement