ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

Feb 7 2026 10:01 AM | Updated on Feb 7 2026 10:01 AM

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

కామవరపుకోట: పోలీస్‌ సిబ్బంది ఫైరింగ్‌లో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ సూచించారు. వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పురస్కరించుకుని తడికలపూడిలో గురువారం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వల్ల పోలీసు సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, దీని కోసం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ను వినియోగించుకుని వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో అన్ని సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు శిక్షణకు హాజరయ్యారు. ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్‌ అదనపు ఎస్పీ జి.మునిరాజా పాల్గొన్నారు.

నేర సమీక్షా సమావేశం

ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏలూరులో జాతరకు లక్షలాది మంది వచ్చినా ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసిన పోలీస్‌ సిబ్బందిని అభినందించారు. ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ పోలీస్‌ శాఖకు కలెక్టర్‌ అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమన్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్‌.సుస్మిత, ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, ఏబీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ హబీబ్‌ బాష, డీఎస్పీలు డి.శ్రావణ్‌కుమార్‌, ఎం.వెంకటేశ్వరరావు, కేవీవీఎన్‌వీ ప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, ఏపీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement