మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అర్చకులు, వేద పండితులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,28,350 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1450 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు.
ఏలూరు టౌన్: ఏలూరు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శక్తి టీమ్ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... ఒక స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి భయంతో పారిపోయేందుకు ప్రయత్నింగా శక్తి టీం వారిని అదుపులోకి తీసుకుని తనికీ చేసింది. గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువకులతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి, రూ.2.02 లక్షల రెండు స్కూటీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా స్టేషన్ డీఎస్పీ యూ.రవిచంద్ర పర్యవేక్షణలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీమ్ సభ్యులు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచారు. శనివారం శక్తి టీం సభ్యులు పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై టూటౌన్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
కుక్కునూరు: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని దాచారం ఇసుక రీచ్ నుంచి శుక్రవారం రాత్రి రెండు టిప్పర్ లారీలలో ఇసుకను తరలిస్తుండగా అశ్వారావుపేట వద్ద తెలంగాణ పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.
ఆగిరిపల్లి: ఆగిరిపల్లికి చెందిన బెజవాడ రామారావు (65) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆగిరిపల్లికి చెందిన రామారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం మల్లిబోయినపల్లి వద్ద పొలంలో ఉన్న గేదెల కోసం ఆగిరిపల్లి నుంచి ట్రాక్టర్ ఎక్కగా బస్టాండ్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. కింద పడిపోయిన రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని బొలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని హోటల్ ఎన్‌లో శ్రీ కృష్ణ సుజుకి షోరూం తరఫున కొత్త సుజుకి ఈ–యాక్సెస్ ఈవీ స్కూటర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. షోరూం యజమాని, శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నారా శేషు, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.గోవిందరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనాలు కస్టమర్ల ఆదరణ పొందాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారా నరసింహమూర్తి, డైరెక్టర్లు ఎన్‌వీ హనుమకుమార్, సీహెచ్ సూరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్దిలో అభిషేక సేవ
మద్దిలో అభిషేక సేవ
మద్దిలో అభిషేక సేవ


