తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణ
జంగారెడ్డిగూడెం: వీఆర్వో సాయంతో తమకు చెందాల్సిన భూమిని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ దంపతులు ప్రజాసంఘాల సహాయంతో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధితులు అంగిన రాంబాబు, చిన్నాయమ్మ వివరాలు వెల్లడించారు. రాంబాబుకు ఇద్దరు సోదరులు ఉండగా ఓ సోదరుడు చిన్నతనంలోనే వేరొకరికి దత్తత వెళ్లిపోయాడు. మరో సోదరుడు మరణించాడు. రాంబా బు తల్లిదండ్రులకు కొయ్యలగూడెం మండలం బ య్యనగూడెంలోని 0.579 ఎకరాల భూమి ఉంది. దీనిని దత్తత వెళ్లిన సోదరుడు ఓ వీఆర్వో సాయంతో తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని రాంబాబు దంపతులు ఆరోపిస్తున్నా రు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామన్నారు అయితే సదరు వీఆర్వో బంధువుకు ఈ భూమిని విక్రయించినట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తోందన్నారు. సదరు వీఆర్వో అక్రమాలకు పాల్పడుతున్నాడని, తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్ ఎం.గోపిని వివరణ కోరగా రెవెన్యూ రికార్డులు, ఆధార్ కార్డులు, లింకు డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేశామని, తమ కా ర్యాలయంలో ఎలాంటి లోపం, అక్రమాలు జరగ లేదని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపుతామన్నారు. లీగల్ ఓపీనియన్ కూ డా తీసుకున్నాకే తాము రిజిస్ట్రేషన్ చేశామన్నారు.


