కొత్త బాధ్యతల్లో రహానే | Ajinkya Rahane Turns Commentator for India vs Sri Lanka Test Series Post-Retirement | Sakshi
Sakshi News home page

కొత్త బాధ్యతల్లో రహానే

Aug 12 2026 12:24 PM | Updated on Aug 12 2026 12:32 PM

Ajinkya Rahane Set For Commentary Switch After Retirement From Cricket

భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ఇటీవలే ముగింపు పలికిన అతడు.. ఇక నుంచి కామెంటేటర్‌గా తన అనుభవాన్ని అభిమానులతో పంచుకోనున్నాడు.

భారత్-శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో రహానే తొలిసారి టెస్ట్ కామెంటరీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న ఈ సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనున్నారు.

టెస్ట్ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న రహానే.. ఇక మ్యాచ్‌ను బయట నుంచి విశ్లేషించనున్నాడు. బ్యాటర్ ఆలోచనా విధానం, బౌలర్ల వ్యూహాలు, ఫీల్డ్ సెట్టింగ్స్, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నాడు.

‘కొత్త కోణంలో మ్యాచ్‌ను చూడబోతున్నా’
తన కొత్త బాధ్యతపై రహానే ఆసక్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్ అత్యున్నత ఫార్మాట్ అని, ఎన్నో సంవత్సరాలు భారత్ తరఫున ఈ ఫార్మాట్‌లో ఆడిన తర్వాత ఇప్పుడు మరో కోణంలో ఆటను చూడటం ప్రత్యేక అనుభూతి అనిపేర్కొన్నాడు.

85 టెస్టులు.. 5 వేలకుపైగా పరుగులు
రహానే భారత జట్టు తరఫున 85 టెస్టులు ఆడాడు. 5,077 పరుగులు సాధించిన అతని టెస్ట్ కెరీర్‌లో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో కీలక సమయాల్లో జట్టును ఆదుకున్న బ్యాటర్‌గా రహానేకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై అతని బ్యాటింగ్, క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే తీరు అభిమానులను ఆకట్టుకుంది. రహానే కెప్టెన్‌గా కూడా టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు .

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement